యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)నటించిన దేవర(devara)మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన భామ జాన్వీ కపూర్(janhvi kapoor)తొలి సినిమాలోనే అధ్బుతమైన నటనని ప్రదర్శించి తన తల్లి శ్రీదేవికి తగ్గ వారసురాలని అనిపించుకోవడమే కాకుండా అశేష అభిమానులని కూడా సంపాదించుకుంది. ప్రెజంట్ రామ్ చరణ్ తో కలిసి ఒక మూవీ చేస్తున్న జాన్వీ కి మరిన్ని క్రేజీ ఆఫర్స్ కూడా వస్తున్నాయి.
రీసెంట్ గా జాన్వీ కపూర్ సోదరుడు అర్జున్ కపూర్(arjun kapoor)ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు నాకు జాన్వీ తో ప్రత్యేక అనుబంధం ఉంది.ఏ విషయంలో అయినా నిజాయితీగా ఉండే జాన్వీ ప్రశంసలు, విమర్శలని ఒకేలా తీసుకుంటుంది.ఇండస్ట్రీ లో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొవడానికి ఎంతో కష్టపడుతు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటుంది.సినిమాలకి సంబంధించి ప్రయోగాలు చెయ్యడం అంటే కూడా జాన్వీ కి చాలా ఇష్టం.అందుకే ఎప్పుడు కొత్త కథలని ఎంచుకుంటూ ముందుకు వెళ్తు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడుతుంది.
ప్రతి రోజు ఎన్నో విషయాల గురించి చర్చించుకుంటాం.తినే ఆహారం దగ్గరనుంచి చెయ్యబోయే ప్రాజెక్టు ల దాకా అన్నిటి గురించి మాట్లాడుకుంటాం.ఇది ఎప్పటికి ఇలాగే కొనసాగాలి.ఆమె ప్రతి నిర్ణయానికి నా మద్దతు కూడా ఉంటుందని చెప్పుకొచ్చాడు.అర్జున్ కపూర్ స్వయంగా జాన్వీ కి అన్నయ్య అవుతాడనే విషయం అందరకి తెలిసిందే.జాన్వీ తండ్రి బోణి కపూర్ మొదటి భార్య కొడుకే అర్జున్ కపూర్.